పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం సాధారణంగా ఉంది. మంథని డిపో పరిధిలో బస్సులు అధికంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తక్కువగా ఉండటం వల్ల బస్సులు వెలవెలబోతున్నాయి. భూపాలపల్లి , హన్మకొండ, చెన్నూర్, మంచిర్యాల, గోదావరిఖని, కరీంనగర్ ప్రాంతాలకు వేర్వేరుగా బస్సులు నడుపుతున్నారు. అయినప్పటికీ బస్సులన్నీ ప్రయాణికులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సమ్మె సందర్భంగా తాత్కాలికంగా విధులకు అవసరమయ్యే కండక్టర్లను, డ్రైవర్లను ఎంపిక చేస్తున్నందున అభ్యర్థులు అధిక సంఖ్యలో మంథని డిపో వద్దకు చేరుకుంటున్నారు.
బస్సులు ఫుల్లు... ప్రయాణికులు నిల్లు... - MANTHANI BUS STAND
రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు ఎక్కువగా ఉండి బస్సులు లేక అవస్థలు పడుతుంటే... పెద్దపల్లి జిల్లా మంథనిలో మాత్రం బస్సులు ఎక్కువగా ఉండి ప్రయాణికులు లేక ప్రయాణ ప్రాంగణాలన్నీ వెలవెలబోతున్నాయి.
![బస్సులు ఫుల్లు... ప్రయాణికులు నిల్లు...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4669023-67-4669023-1570354168762.jpg)
బస్సులు ఫుల్లు... ప్రయాణికులు నిల్లు...