పెద్దపెల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఉదయం నుంచి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. కానీ 11 గంటలకు పోలీసుల పటిష్ఠమైన బందోబస్తు మధ్య మంథని డిపో నుంచి కరీంనగర్‌కు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. పోలీసులు ఈ బస్సుకు రక్షణగా కరీంనగర్ వరకు వజ్ర వాహనాన్ని పంపించారు. బస్సులో ఆరుగురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు.
పోలీస్ బందోబస్తు మధ్య బస్సు ప్రయాణం - పటిష్ఠమైన బందోబస్తు నడుమ మంథని నుంచి కరీంనగర్ వరకు వెళ్లిన ఆర్టీసీ బస్సు
పోలీసుల పటిష్ఠమైన బందోబస్తు నడుమ మంథని నుంచి కరీంనగర్ వరకు ఓ ఆర్టీసీ బస్సు వెళ్లింది. అందులో ప్రయాణికుల కంటే... పోలీసులే ఎక్కువగా ఉన్నారు.
![పోలీస్ బందోబస్తు మధ్య బస్సు ప్రయాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4800745-74-4800745-1571468493333.jpg)
పోలీస్ బందోబస్తు మధ్య బస్సు ప్రయాణం