పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామం వద్ద పెద్దపల్లి నుంచి గోదావరిఖని వెళ్తున్న ఆర్టీసీ బస్సు, మంథని వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం - పెద్దపల్లి జిల్లా గుండారం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
బస్సు ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి దుర్మరణం