పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం... ఆధ్యాత్మికతకు, అనేక దేవాలయాలకు నిలయం. నిత్యం దేవాలయాల్లో పూజలందుకునే దేవతామూర్తులు... నేటి రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా అర్చన, హారతులకు దూరంగా ఉన్నాయి. మంథని పట్టణంలోని 5 శివాలయాలు, 11 హనుమాన్ మందిరాలు, శ్రీ మహా గణాధిపతి, శ్రీ మహాలక్ష్మి దేవాలయం, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా గుడి, లలిత, అయ్యప్పస్వామి, కన్యకా పరమేశ్వరి ఆలయాలు మూసివేశారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు... నేడు ఎవరూ లేక, ఆలయ ద్వారాలకు తాళాలతో దర్శనమిస్తూ వెలవెలబోతున్నాయి. నిత్యం పూజాధికాలు, నైవేద్యాలు, హారతులు అందుకునే దేవతామూర్తుల విగ్రహాలకు... నిన్నటి రోజునే ముందస్తు పూజలు నిర్వహించి దేవాలయాలను మూసివేశారు. కొంతమంది భక్తులకు ఈ విషయం తెలియక... ఆలయాల వరకు వచ్చి నిరాశతో తిరిగి వెళ్ళిపోవడం గమనార్హం.
సూర్యగ్రహణం... ఆధ్యాత్మికతకు విరామం...! - పెద్దపల్లి జిల్లా ఆధ్యాత్మిక వార్తలు
పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణ వ్యాప్తంగా అన్ని దేవాలయాలు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మూసివేయబడ్డాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు... నేడు ఎవరూ లేక, ఆలయ ద్వారాలకు తాళాలతో దర్శనమిస్తూ వెలవెలబోతున్నాయి. కొందరు భక్తులు విషయం తెలియక ఆలయం వరకూ వచ్చి వెనుదిరిగిపోవడం గమనార్హం.
సూర్యగ్రహణం... ఆధ్యాత్మికతకు విరామం...!