తెలంగాణ

telangana

ETV Bharat / state

బాహుబలి: 4.5కిలోల మగశిశువు జననం - boy child born with 4.5 kilograms in peddapalli

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు నాలుగున్నర కిలోల మగ శిశువు జన్మించాడు. అదీ సహజ ప్రసవం కావడం విశేషం.

boy child born with 4.5 kilograms at godavarikhani in peddapalli district
గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో 4.5కిలోల మగశిశువు జననం

By

Published : Jan 12, 2021, 7:13 AM IST

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాలకు చెందిన సంధ్య పురిటి నొప్పులతో గోదావరిఖని ప్రభుత్వాస్పత్రిలో చేరింది. సాధారణ ప్రసవంలో సంధ్య.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ బాబు నాలుగున్నర కిలోలు ఉండటం వల్ల ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఆసుపత్రికి వచ్చే గర్భిణుల విషయంలో శస్త్రచికిత్సల కన్నా సాధారణ ప్రసవాలపైనే దృష్టి సారిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details