పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని గోదావరి నదిలో మత్స్యకార తెలంగాణ రాష్ట్ర తె ప్పల పోటీల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై పచ్చజెండా ఊపి ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో ఎడారిగా మారిన గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిండుకుండలా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి పేర్కొన్నారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో తెప్పల పోటీలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. అనంతరం మత్స్య వీర తెప్పల పోటీల్లో 220 మంది పాల్గొన్నారు. వీరిలో మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్ గౌడ్‌కు మొదటి బహుమతి, రామగుండం ఎన్టీపీసీకి చెందిన పిట్టల వెంకటేష్‌కు రెండో బహుమతి, మంచిర్యాలకు చెందిన రాజేష్‌కు మూడో బహుమతి లభించింది. విజేతలకు మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు' - 'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు'
గోదావరి నదిలో తెప్పల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
'మొట్టమొదటిసారి తెలంగాణలో తెప్పల పోటీలు'
Last Updated : Sep 30, 2019, 1:23 PM IST