తెలంగాణ

telangana

ETV Bharat / state

మోదీ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లిలో రక్తదాన శిబిరం - తెలంగాణ తాజా వార్తలు

ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా ముద్ర అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గోదావరిఖని కృష్ణవేణి హైస్కూల్​లో ఏర్పాటు చేసిన క్యాంపులో సుమారు వందమంది రక్తదానం చేశారు.

blood camp
మోదీ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లిలో రక్తదాన శిబిరం

By

Published : Sep 17, 2020, 2:11 PM IST

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన సందర్భంగా ముద్ర అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

పెద్దపల్లి రీజియన్​కు చెందిన సుమారు వంద మంది ముద్ర సిబంది రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ సొసైటీకి పంపించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఏటా నరేంద్రమోదీ జన్మదినం రోజున రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:పదా అన్న ఇళ్లు చూసివద్దాం... భట్టితో తలసాని

ABOUT THE AUTHOR

...view details