తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ సహకారంతోనే న్యాయవాద దంపతుల హత్య: సంజయ్ - వామన్​రావు దంపతుల హత్యను ఖండించిన బండి సంజయ్

పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో వామన్​రావు దంపతుల మృతదేహాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. ఈ హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

bjp-state-president-bandi-sanjay-allegations-about-vamanrao-couple-murder-in-kalvacharla
ప్రభుత్వ సహకారంతోనే న్యాయవాద దంపతుల హత్య: సంజయ్

By

Published : Feb 18, 2021, 9:59 AM IST

Updated : Feb 18, 2021, 10:42 AM IST

ప్రభుత్వ సహకారంతోనే న్యాయవాద దంపతుల హత్య: సంజయ్

న్యాయవాది దంపతుల హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించిన బండి... వామన్​రావు తల్లిదండ్రులను పరామర్శించారు. ఇది సర్కారు హత్యేనని... ప్రభుత్వ సాయంతో పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపించారు. వామన్​రావు ప్రభుత్వంపై పోరాడుతున్నందునే హత్య చేశారన్నారు.

న్యాయవాదులను అతి కిరాతకంగా హతమార్చడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్పందించకుంటే హత్యను సీఎం సమర్థించినట్టేనని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ఈ దారుణాన్ని ఖండిస్తున్నారని చెప్పారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి... హత్య వెనుక ఎవరున్నారో వెంటనే తెల్చాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వెంట పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, రామగుండం మాజీ ఎమ్మెల్యే, భాజపా జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఉన్నారు.

ఇదీ చూడండి:న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది?

Last Updated : Feb 18, 2021, 10:42 AM IST

For All Latest Updates

TAGGED:

bandi

ABOUT THE AUTHOR

...view details