రాబోయే రోజుల్లో భారతదేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణతో పాటు ఎన్వీ సుభాష్ సమావేశమయ్యారు. ఆరు సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు అండగా నిలిచిందని ఎన్వీ సుభాష్ అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది: భాజపా - దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణతో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుందని సుభాష్ తెలిపారు.
![దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది: భాజపా bjp meeting in peddapalli district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7578382-877-7578382-1591895396701.jpg)
'దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది'
ప్రపంచ దేశాలు భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయంటే దానికి కారణం భాజపా ప్రభుత్వమేనని సుభాష్ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ సాహోసోపేత నిర్ణయాలతో పరిష్కరించారని గుర్తు చేశారు. అలాగే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: నూతన పురపాలక చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాలి: కేటీఆర్