ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్... ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా భాజపా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కమలం నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.
'రైతు ఆత్మహత్య ప్రభుత్వ నిరంకుశత్వానికి ఉదాహరణ'
పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ఆందోళన చేశారు. ఎస్సీ, ఎస్టీల పక్షాన పోరాటం చేస్తున్న తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడం అవివేకమని జిల్లా భాజపా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ విమర్శించారు.
bjp leaders protest against arrest in ramagundam
ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉండి వారి పక్షాన పోరాటం చేస్తున్న భాజపా నాయకులను అరెస్టు చేయడం అవివేకమని సత్యనారాయణ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో ఓ రైతు తన 13 గుంటల భూమి కోసం ఆత్మహత్య చేసుకోవటం ప్రభుత్వ నియంతృత్వానికి ఉదాహరణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ భాజపా ఇంఛార్జి బల్మురి నరేందర్ రావు, రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.