ఆదర్శంగా నిలుస్తున్న 39 అడుగుల మట్టి గణపతి - big eco friendly ganesh at peddapalli
పర్యావరణ పరిరక్షణకు ఆ యువకులంతా కంకణబద్ధులై మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 36 అడుగుల మట్టి విగ్రహాన్ని పూజిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆదర్శంగా నిలుస్తున్న 39 అడుగుల మట్టి గణపతి
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఛత్రపతి యువసేన యువకులు గత రెండేళ్లుగా మట్టితో తయారు చేసిన భారీ విగ్రహాలను పూజిస్తున్నారు. గతేడాది 36 అడుగుల మట్టి విగ్రహాన్ని ఆరాధించగా.. ఈ సంవత్సరం 39 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగకుండా మట్టి, సున్నం, సన్న ఇసుక, చెక్క పొట్టు, దారం లాంటి పదార్థాలను ఉపయోగిస్తూ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. నీటి ట్యాంకర్ల ద్వారా నిమజ్జనం చేస్తామని యువకులు చెప్పారు.