తెలంగాణ

telangana

ETV Bharat / state

కోత విధించిన 50 శాతం వేతనాన్ని తిరిగి చెల్లించాలి: బీఎంఎస్ - singareni news in peddapally

సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం సింగరేణి అర్జీ-1,2,3 ఏరియాలోని అన్ని బొగ్గు గనుల్లో దీక్షలు ప్రారంభించారు.

Bharatiy Majdoor Union protest in peddapally
భారతీయ మజ్దూర్ సంఘ్

By

Published : Sep 26, 2020, 12:07 PM IST

కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో కార్మికుల జీతంలో కోత విధించిన 50 శాతం వేతనం తిరిగి చెల్లించాలని కోరుతూ భారతీయ మజ్దూర్​ సంఘ్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. 2019- 20 సంవత్సరంలోని లాభాలను ఇప్పటికీ ప్రకటించలేదని.. వెంటనే ప్రకటించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్జీ-1,2,3 ఏరియాలోని అన్ని బొగ్గు గనుల్లో బీఎంఎస్​ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు.

భారతీయ మజ్దూర్ సంఘ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థ నుంచి రావాల్సిన 12 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేదంటే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కార్మిక సమస్యలపై పోరాటాలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details