అయోధ్య విషయంలో ఈనెల 15న అత్యున్నత న్యాయస్థానం వెలువరించే తీర్పు పట్ల ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానికులతో శాంతి సమావేశం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో భారత దేశానికి అత్యంత చరిత్ర ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అత్యున్నత న్యాయస్థానం వెలువరించే తీర్పు పట్ల ప్రజలు సహకరించాలని కోరారు. ఎక్కడ ర్యాలీలు, నిరసనలు, ఆనందోత్సాహాలు నిర్వహించుకోవడం నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు విలువైందని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయోధ్య తీర్పుపై శాంతియుతంగా ఉండాలి: సీపీ - ramagundam cp on verdict of Ayodhya
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానికులతో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారయణ శాంతి సమావేశం నిర్వహించారు. ఈనెల 15న వెలువడే అయోధ్య తీర్పు పట్ల ప్రజలు శాంతియుతంగా ఉండాలని పేర్కొన్నారు.
![అయోధ్య తీర్పుపై శాంతియుతంగా ఉండాలి: సీపీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4968998-thumbnail-3x2-df.jpg)
అయోధ్య తీర్పుపై రామగుండం సీపీ