ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పెద్దపెల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'కరోనా ఉన్నప్పటికీ బతుకమ్మ చీరల పంపిణీ' - Manthani bathukamma saree distribution news
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు.
!['కరోనా ఉన్నప్పటికీ బతుకమ్మ చీరల పంపిణీ' 'కరోనా ఉన్నప్పటికీ బతుకమ్మ చీరల పంపిణీ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9110317-330-9110317-1602232904371.jpg)
'కరోనా ఉన్నప్పటికీ బతుకమ్మ చీరల పంపిణీ'
కరోనా వైరస్ ఉన్నప్పటికీ... సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ఈసారి బతుకమ్మ చీరలు అందంగా రూపొందించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:హైదరాబాద్లో మళ్లీ చెలరేగుతూ దడ పుట్టిస్తున్న గొలుసు దొంగలు