పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ టోల్గేట్ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఫాస్టాగ్ విధానం అమల్లోకి రావడంతో సిబ్బందిని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బసంత్‌నగర్ హెచ్‌కేఆర్ టోల్గేట్లో 120 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా... ఫాస్టాగ్ విధానం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరిగా తొలగిస్తున్నారని తెలిపారు. లేదంటే... ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నారన్నారు. పది వేల రూపాయల జీతానికి ఆంధ్రాకు వెళ్లి ఎలా బ్రతకాలని సిబ్బంది ప్రశ్నించారు.
టోల్గేట్ సిబ్బంది ధర్నా... భారీగా ట్రాఫిక్ జామ్ - టోల్గేట్ సిబ్బంది ధర్నా
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ టోల్గేట్ సిబ్బంది ధర్నాకు దిగారు. ఫాస్టాగ్ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరిగా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలోనూ విధులు నిర్వర్తిస్తున్న తమపై ఎలాంటి కనికరం లేకుండా ఉద్యోగాలు తొలగించటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
basant nagar toll gate employees protest for dismissing jobs
ఓ పక్క కరోనా కేసులు భారీగా పెరుగుతున్నా... ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారి వద్ద టోల్ వసూలు చేస్తూ... నిత్యం భయాందోళనతో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అయినా ఎలాంటి కనికరం లేకుండా ఇలా ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలు ఇక్కడే ఉండేలా హెచ్‌కేఆర్ యాజమాన్యం హామీ ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని సిబ్బంది తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై టోల్ సిబ్బంది... ధర్నా చేయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.