పెద్దపెల్లి జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటించారు. జూలపల్లి, సుల్తానాబాద్‌లో దివంగత మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటస్వామి కుమారుడు వివేక్‌తో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సుల్తానాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి ప్రసంగించారు.
తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమరవీరులతోపాటు.. తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులను విస్మరించినట్లు బండి ఆరోపించారు. గడిచిన ఆరేళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు, యువత, నిరుపేదలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే తెరాస నాయకులను నిరుద్యోగులు ప్రశ్నించాలని కోరారు. కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు దివంగత మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి చేసిన సేవలను ఆయన కొనియాడారు.