పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపోలో.. వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాల నివారణపై కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఏడాది.. డిపోకి కొత్తగా విధులు నిర్వహించడానికి వచ్చే కార్మికులకు ప్రమాదాల గురించి వివరిస్తూ.. ప్రయాణికుల రక్షణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి వివరిస్తామని డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు.
ఆర్టీసీ డిపోలో.. వేసవి ప్రమాదాలపై అవగాహన సదస్సు - మంథని ఆర్టీసీ డిపో
పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపోకు విధులు నిర్వహించడానికి వచ్చిన నూతన కార్మికులకు.. డిపో మేనేజర్ రవీంద్రనాథ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపత్కాలంలో.. ప్రయాణికుల రక్షణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి వారికి వివరించారు.
ఆర్టీసీ డిపోలో.. వేసవి ప్రమాదాలపై అవగాహన సదస్సు
రోడ్డుకు ఇరువైపులా ఉండే సూచికలు, రంగుల గురించి.. ఫైర్ సిబ్బంది, కార్మికులకు వివరించారు. ఈ సదస్సులో.. మంథని ఫైర్ స్టేషన్ సిబ్బందితో పాటు ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దూలపల్లి అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు