పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్‌కు కొత్తగా వచ్చిన 137 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ హాజరయ్యారు. కానిస్టేబుళ్ల స్వస్థలాలు, చదవు గురించి అడిగి తెలుసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సత్వర సేవలు అందించాలని అన్నారు.
మానవీయ కోణంలో సమస్యలను పరిష్కరించాలి: డీసీపీ - రామగుండం కమిషనరేట్
మానవీయ కోణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ అన్నారు. కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
మానవీయ కోణంలో సమస్యలను పరిష్కరించాలి: డీసీపీ
పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సేవలతో ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రామగుండం కమిషనరేట్, తెలంగాణ పోలీసులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. బయట విధులకు వెళ్లినప్పుడు క్రమశిక్షణతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, ఏఆర్ కమాండెంట్ సంజీవ్, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నారాయణ పాల్గొన్నారు.