పెద్దపల్లి జిల్లా రామగుండం బొడగుట్ట సమీపంలో బైక్ ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురుతో పాటు ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామగుండం నుంచి లింగాపూర్ వెళ్తుండగా ఎదురుగా ద్విచక్ర వాహనం రావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్, ఆటో ఢీ... ఆరుగురికి తీవ్ర గాయాలు - dhee
ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు