పెద్దపల్లి జిల్లా మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. పుట్టినప్పటి నుంచి బాబు ఆరోగ్యం సరిగా లేదు. దీంతో కరీంనగర్సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.
అక్కడి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో చెంజర్ల మండలం ఖాదర్ గూడెం వద్ద బాబు గుండె ఆగిపోయింది. వెంటనే 108 సిబ్బంది వెంకట్ అప్రమత్తమయ్యారు. పీసీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేసి ప్రాణం పోశాడు.
సివిల్ ఆస్పత్రిలో బాబుకు చికిత్స అందిస్తూ ఉండగా.. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి వెంటనే బయలుదేరాము. దారిలో బాబుకు హృదయ స్పందన ఆగిపోయింది. అప్పటికప్పుడు 108 వైద్య సిబ్బందితో మాట్లాడి పీసీఆర్ చేశాము. మళ్లీ గుండె కొట్టుకుంది. అవసరమైన చికిత్స అందించి వెంటనే ఎంజీఎంకు తీసుకెళ్లాము.