పెద్దపల్లి జిల్లా మంథనిలో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. రావుల చెరువులోని నీటితో నగరంలోని మహాలక్ష్మీ దేవాలయ ఆవరణలోని పోచమ్మ తల్లికి 1008 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని.. రైతులందరూ సుఖంగా ఉండాలని.. గ్రామం సుభిక్షంగా ఉండాలని పోచమ్మను కోరుకున్నారు.
వానలు సమృద్ధిగా కురవాలని జలాభిషేకం - వానలు సమృద్ధిగా కురవాలని జలాభిషేకం
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వర్షాలు కురవాలని మహాలక్ష్మీ దేవాలయం ఆవరణలో పోచమ్మ తల్లికి జలాభిషేకం నిర్వహించారు.

వానలు సమృద్ధిగా కురవాలని జలాభిషేకం