తెలంగాణ

telangana

ETV Bharat / state

A woman dealer brutally murdered in Peddapalli district : పెద్దపల్లి జిల్లాలో మహిళా డీలర్ దారుణహత్య - A brutal murder of a woman

A woman dealer brutally murdered in Peddapalli district : పెద్దపల్లి జిల్లాలో ఓ మహిళా రేషన్ డీలర్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సరుకుల కోసమని ఇంటినుంచి వెళ్లిన మహిళ ఎంతసేపైనా ఇంటికి రాలేదు. చివరకు మంథనికి చెందిన ఓ ఇంట్లో శవమై కనిపించింది. ఆ విషయమే కొంపముంచిందా?

Brutal murder of woman in Peddapalli district
A woman dealer brutally murdered in Peddapalli district

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 4:48 PM IST

Brutal murder of woman in Peddapalli district : పెద్దపల్లి జిల్లాలో ఓ మహిళా రేషన్ డీలర్దారుణహత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. మంథని మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహిళా రేషన్ డీలర్ బందెల రాజమణి (37) హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పట్టణంలోని ఎరుకలగూడెంలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం, ప్రకారం మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బందెల రాజమణి రేషన్ డీలర్​గా పనిచేస్తుంది.

ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. రేషన్ డీలర్గా పని చేసిన ఆమె భర్త రమేష్ నాలుగేళ్ల క్రితం మృతి చెందగా, రాజమణి అప్పటి నుంచి రేషన్ డీలర్ గా కొనసాగుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నది. రేషన్ షాప్ కి సరుకులు తీసుకొచ్చే ఆటో డ్రైవర్ పైడాకుల సంతోష్ తో కొంతకాలం క్రితం రాజమణికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సంతోష్ తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు.

మహిళ దారుణ హత్య.. ఫ్లైఓవర్​ పక్కనే కవర్​లో శరీర భాగాలు.. శ్రద్ధావాకర్​ ఘటనలానే!

A brutal murder of a woman :రాజమణి, సంతోష్​ల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఇరువురూ కొంతకాలంగా మాట్లాడుకోవడం లేదు. ఇదిలా ఉంటే రాజమణి సోమవారం సాయంత్రం సరుకుల కోసం మంథనికి వెళ్తున్నాను.. అని ఇంట్లో పిల్లలకు చెప్పి బయలుదేరింది. ఎంత సేపైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె పిల్లలు ఆందోళన చెందారు. ఇదే క్రమంలో ఆమెకు ఫోన్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. తల్లివైపు నుంచి సమాచారం రాలేదు. ఈ క్రమంలో మంథని ఎరుకలగూడెంలో పైడాకుల సంతోష్ ఉంటున్న అద్దె ఇంట్లో రాజమణి మృతదేహాన్ని గుర్తించారు. తన సోదరిని తరచూ సంతోష్ వెేధించేవాడని మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెళ్లి చేసుకోలేదని కోపం.. ప్రియుడి 11ఏళ్ల కొడుకు దారుణ హత్య.. ఇంటికి వెళ్లి మరీ..

రాజమణిని వేధించడం, తనను తిరస్కరించిందనే క్రమంలో సంతోష్ హత్య చేసినట్లు మృతురాలి సోదరుడుపోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె సోదరుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంతోష్​ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు కారణాలేంటి అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Girl Killed For Touching Cycle Seat : సైకిల్​ సీట్​ను తాకిందని దారుణం.. ఐదేళ్ల చిన్నారిని గొంతు కోసి హత్య చేసిన యువకుడు

దిల్లీలో మరో ఘోరం.. మహిళ దారుణ హత్య.. శవాన్ని ఇంట్లో వదిలి ప్రియుడు పరార్

ABOUT THE AUTHOR

...view details