పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి ఇటుకల బట్టిలో కొంతమంది ఒడిస్సా కార్మికులు పనిచేస్తున్నారు. రోజులాగే ఇటుకలను లోడ్ చేయడం కోసం లారీపై ఎక్కిన శంకర్‌బాగ్ అనే ఒరిస్సా కార్మికుడు విద్యుదాఘాతంతో మరణించాడు. లారీపై భాగంలో ఉన్న విద్యుత్ తీగలు తలకు తగిలి విద్యుత్ షాక్‌కి గురై అతను కింద పడిపోయాడు.
విద్యుదాఘాతంతో ఇటుకల బట్టి కార్మికుడు మృతి - మృతి
విద్యుదాఘాతంతో ఇటుకల బట్టీలో పనిచేసే కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో ఇటుకల బట్టి కార్మికుడు మృతి
గమనించిన తోటి కార్మికులు వెంటనే అతన్ని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మృతి చెందాడు. బట్టి యజమాని ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రభుత్వం కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించినా తమకు సెలవు ఇవ్వకుండా పనిచేయించుకుంటున్నారని వారు వాపోయారు.
ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము