పెద్దపెల్లి జిల్లా మంథనిలోని పోచమ్మవాడకు చెందిన ఉప్పల శ్రీనివాస్ తనను పోలీసులు కొట్టారని ఆరోపించారు. రాత్రి సమయంలో తన ఇంటి సమీపంలోని గద్దె మీద కూర్చున్నప్పుడు పోలీసులు దూషిస్తూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని చెప్పారు. ఏ పార్టీకి చెందిన వాడివి అంటూ, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ బెదిరిస్తూ ఆకారణంగా బూతులు తిట్టారని వాపోయారు.
'గద్దె మీద కూర్చున్నందుకు పోలీసులు కొట్టారు' - municipal elections in telangana
తన ఇంటి సమీపంలో గల గద్దె మీద కూర్చున్నందుకు పోలీసులు కొట్టారని ఓ యువకుడు ఆరోపించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగింది. యువకుడు తాగిన మైకంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని సీఐ మహేందర్ తెలిపారు.
'గద్దె మీద కూర్చున్నందకు పోలీసులు కొట్టారు'
ఆరోపణలపై స్పందించిన సీఐ యువకుడు తాగిన మైకంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడని చెప్పారు. శ్రీనివాస్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చి వారి స్నేహితుల పూచీకత్తుపై వదిలి పెట్టామన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!