పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం జగన్నాథపురం గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా సదానందం అనే రైతు విత్తనాల విక్రయం చేపడుతున్నారనే సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు సదరు రైతు విత్తనాలు నిల్వచేసిన ఇంటిపై దాడి చేశారు. పెద్దపెల్లి మండల వ్యవసాయ అధికారి అలివేణి తనిఖీలు చేసి తొమ్మిది లక్షల రూపాయల విలువ గల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ అనుమతి లేకుండా విత్తనాలను సంచుల్లో నింపి రైతులకు అమ్మకాలు జరుపుతున్న సదానందంపై కేసు నమోదు చేశారు.
అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న రైతు అరెస్టు - ప్రభుత్వ అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
ప్రభుత్వ అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న రైతును వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. తొమ్మిది లక్షల రూపాయల విలువ గల విత్తనాలను స్వాధీనం చేసుకుని సదరు రైతుపై కేసు నమోదు చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న రైతు అరెస్టు