రాష్ట్రంలోని గంగపుత్రులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేయాలని శ్రీధర్‌బాబు ప్రభుత్వాన్ని కోరారు.పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం పార్వతి బ్యారేజీలో అఖిల భారత కమిటీ ఆధ్వర్యంలో గంగ తెప్పోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బెస్తపల్లి, దుబ్బపల్లి గ్రామప్రజలు మేళాతాళాల మధ్య గంగమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించి నదిలో నిమజ్జనం చేశారు.
గంగపుత్రుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : శ్రీధర్‌బాబు - ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతి బ్యారేజీలో అఖిల భారత కమిటీ ఆధ్వర్యంలో గంగ తెప్పోత్సవం నిర్వహించారు. మండలంలోని బెస్తపల్లి, దుబ్బపల్లి గ్రామప్రజలు గంగమ్మకు బోనాలు సమర్పించి పూజలు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గంగపుత్రులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గంగపుత్రుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : శ్రీధర్‌బాబు
గ్రామానికి చెందిన దాదాపు 300 కుటుంబాలు మత్స్యసంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరందరు గతంలో వలస వెళ్తుండగా వారి జీవనోపాధికోసం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిరిపురం వద్ద పార్వతి బ్యారేజీని ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమంలో అఖిలభారత తెప్పోత్సవం కమిటీ అధ్యక్షుడు సత్యం బెస్త, గంగపుత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'చిత్తశుద్ధి ఉంటే భాజపా నేతలు రూ.25వేలు అందించాలి'
TAGGED:
peddapalli dist news