తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన కోలాటం - ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన కోలాటం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శన రికార్డు సాధించింది. సింగరేణి స్టేడియంలో ఏకకాలంలో 6,700 మంది మహిళలు అన్నమాచార్య కీర్తనలకు అనుకూలంగా కన్నుల పండుగగా నృత్య ప్రదర్శన చేశారు. మహిళలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంస పత్రాలను అందించారు.

6700 Women Wonder Record With Kolatam In Godavarikhani
6700 Women Wonder Record With Kolatam In Godavarikhani

By

Published : Feb 18, 2021, 4:15 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ 67వ పుట్టిన రోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించిన కోలాట నృత్య ప్రదర్శన రికార్డు సాధించింది. 6,700 మంది మహిళలతో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో చేసిన ఈ ప్రదర్శన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు సంస్థ ఇంఛార్జి రంగా జ్యోతి ప్రకటించారు. సింగరేణి స్టేడియంలో ఏకకాలంలో వేలాది మంది మహిళలు అన్నమాచార్య కీర్తనలకు అనుకూలంగా కన్నుల పండుగగా నృత్య ప్రదర్శన చేశారు.

అవార్డు, ప్రసంశ పత్రాన్ని ఎమ్మెల్యే చందర్​తో పాటు మహిళలకు అందించారు. ఎక్కడా లేని విధంగా కోలాట ప్రదర్శనలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్న మహిళలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంస పత్రాలను అందించారు.

అనంతరం స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, బ్రహ్మనోత్తముల మంత్రోచ్ఛారణలు, మేళ తాళాలతో కన్నులపండువగా జరిపించారు. శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి శిష్యులు శ్రీ వేదా నాథ స్వామి మంగళ శాసనాలలో అలివేలి మంగ శ్రీ శ్రీనివాస కళ్యాణ వైభోగం ఘనంగా జరిపారు.

ఇదీ చూడండి:'రామోజీ ఫిల్మ్​ సిటీ' పర్యటకం మళ్లీ షురూ

ABOUT THE AUTHOR

...view details