పెద్దపల్లి జిల్లాలో పపలు పార్టీలకు చెందిన 500 మంది నాయకులు,కార్యకర్తలు తెరాసలో చేరారు. రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలను మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తుందని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లు అలుపెరగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. అనవసరమైన అరోపణలు చేస్తూ.. ప్రతిపక్షాలు ప్రజలకు దూరమవుతున్నాయని ఎద్దెవా చేశారు.
పెద్దపల్లిలో తెరాసలోకి వలసలు..మంత్రి సమక్షంలో 500మంది చేరిక
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపపల్లి జిల్లాలో పలు పార్టీల నుంచి తెరాసలో చేరిన వారికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి కండువా కప్పి ఆహ్వానించారు.
తెలంగాణ రైతాంగం గొప్పగా ఉండాలని ముఖ్యమంత్రి సముద్రంలో కలిసిపోతున్న 70వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టి.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు జిల్లాలో విస్తరించి ఉన్న బొగ్గుగనులపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉందని కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం లక్షలమంది పొట్ట కొట్టడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ జరిగితే సింగరేణి ప్రాంత కార్మికులకు అన్యాయం జరుగుతుందని, ప్రైవేట్ గుత్తేదారుల చేతుల్లోకి సింగరేణి సంస్థ వెళ్తుందని ఈ చర్యను రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించారని మంత్రి తెలిపారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జులై 2న అన్ని జాతీయ సంఘాలు, బొగ్గు గని కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ సంక్షేమానికి అకర్షితులై పలు పార్టీల నుంచి టిఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ర్, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్