పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్బీఐలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం సృష్టించింది. బ్యాంకులో పనిచేసే ముగ్గురు ఉద్యోగులకు సోమవారం... కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ ఫలితాలతో బ్యాంకులో పని చేసే ఉద్యోగులతో పాటు ఖాతాదారుల్లో గుబులు నెలకొంది. మంగళవారం ఉదయాన్నే మిగతా సిబ్బంది సుల్తానాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నారు.
ఎస్బీఐలో కరోనా కలవరం.. ఉద్యోగుల్లో భయం భయం - సుల్తానాబాద్ బ్యాంకులో కరోనా కలవరం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్బీఐ ఉద్యోగులను కరోనా మహమ్మారి వెంటాడుతూ... భయపెడుతోంది. తాజాగా... మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావటం వల్ల ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. పెద్దపల్లి బ్రాంచ్‌లో సైతం ఒకరికి కొవిడ్ సోకింది.
![ఎస్బీఐలో కరోనా కలవరం.. ఉద్యోగుల్లో భయం భయం 3 sbi employees tested positive in sulthanabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9968681-441-9968681-1608638072187.jpg)
3 sbi employees tested positive in sulthanabad
ప్రస్తుతానికి ఇంకెవరికీ పాజిటివ్ రాకపోవడం వల్ల కొంత ఊపిరిపీల్చుకున్నారు. బ్యాంకు ఉద్యోగులంతా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లడం వల్ల ఉదయం నుంచి బ్యాంకు సేవలు మందకోడిగా సాగాయి. ఇదిలా ఉండగా పెద్దపల్లి ఎస్బీఐ బ్యాంకులో సైతం కరోనా... కలకలం నెలకొంది. బ్యాంకు ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించటం వల్ల మిగితా ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.