తెలంగాణ

telangana

ETV Bharat / state

వడదెబ్బకు ఒకే గ్రామంలో ముగ్గురు మృతి - kaalwa srirampur

భానుడి ప్రకోపానికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇవాళ ఒక్కరోజే ఓకే ఊరిలో వడదెబ్బకి ముగ్గురు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జల్లాలో చోటుచేసుకుంది.

వడదెబ్బతో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి

By

Published : May 28, 2019, 9:21 PM IST

పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వడదెబ్బ తగిలి మృత్యువాత పడ్డారు. ఎండ తీవ్రత వల్ల పెగడపల్లిలోని రంగు వీరయ్య (70) ఏగోలపు రాజమ్మ(80) రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఇద్దరు మృతి చెందారు. వ్యవసాయ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన సంపంగి రాజ కొమురయ్యకు కూడా వడదెబ్బ తగిలింది. ఇంట్లో సేదతీరే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే గ్రామంలో ముగ్గురు వడదెబ్బతో మృతి చెందడంతో పెగడపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దపెల్లి జిల్లాలో ఈరోజు గరిష్టంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సూర్య ప్రకోపానికి రాలిపోతున్న జనం

ABOUT THE AUTHOR

...view details