తెలంగాణ

telangana

ETV Bharat / state

మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆల్బెండజోల్​ మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

15 students sick after taking albendogole pills
మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

By

Published : Feb 11, 2020, 2:05 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్​నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నులి పురుగుల మందులు వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులు వేశారు. అప్పటి నుంచి పలువురు విద్యార్థులు తలనొప్పి, వాంతులతో బాధపడ్డారు. నేడు ఉదయం వరకు పరిస్థితి అలాగే ఉండడం వల్ల అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

కొంతమందికి కడుపులో నులిపురుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మంజులత పేర్కొన్నారు.​ ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలిపారు.

మరోవైపు విద్యార్థుల అస్వస్థత పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

ఇదీ చూడండి:ఆగంతకుని దాడి... విద్యార్థిని దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details