తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం - speaker

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం జరిగింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

నిజామాబాద్​ జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

By

Published : Jun 14, 2019, 9:47 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ కార్యాలయంలో జరిగింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. ఈ సభ్యులకు ఇదే చివరి సమావేశం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా జడ్పిటీసీలు, ఎంపీపీలు ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మండలాల్లో సమస్యల పరిష్కారం కోసం ఇన్నాళ్లూ కృషి చేసిన ఎంపీపీలు, జడ్పీటీసీలకు స్పీకర్ అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో ప్రజల సమస్యలు పరిష్కారం అయినప్పుడు ఆత్మసంతృప్తి లభిస్తుందని సభాపతి పోచారం పేర్కొన్నారు.

నిజామాబాద్​ జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం

ABOUT THE AUTHOR

...view details