తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి' - clean drive

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్​ రావు సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్​ జడ్పీ కార్యాలయంలో మొక్కలకు నీరు పోసి, పరిసరాలను శుభ్రం చేశారు.

zp-chairman-vital-rao-participate-every-sunday-10am-10-minutes-programme-at-nizamabad-city
'సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

By

Published : Sep 20, 2020, 6:26 PM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్​ రావు పాల్గొన్నారు. నిజామాబాద్​ జడ్పీ కార్యాలయంలోని మొక్కలకు నీరు పోసి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుంకొని.. డెంగీ, కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details