తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి... వ్యాధులకు దూరంగా ఉండండి' - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ విఠల్​ రావు సూచించారు. ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా నగరంలోని తన ఇంట్లో పరిసరాలను శుభ్రం చేశారు.

every sunday 10am 10 minutes program
'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి... వ్యాధులకు దూరంగా ఉండండి'

By

Published : Aug 2, 2020, 4:49 PM IST

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ విఠల్​ రావు పాల్గొన్నారు. నగరంలోని తన ఇంట్లో సీజనల్​ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేశారు. పూలకుండీలల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలను పరిశుభ్రంగా ఉంచుంకొని.. డెంగీ, కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలన్నారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details