తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్ ఫ్రైడేలో భాగంగా మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్ - అమ్మ ఫార్మర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్

నిజామాబాద్ నగరంలో గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా అమ్మ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ దాదన్న విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గ్రీన్ ఫ్రైడేలో భాగంగా మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్
గ్రీన్ ఫ్రైడేలో భాగంగా మొక్కలు నాటిన జడ్పీ ఛైర్మన్

By

Published : Jul 31, 2020, 5:59 PM IST

ప్రతీ శుక్రవారం గ్రీన్ ఫ్రైడే నిర్వహణలో భాగంగా నిజామాబాద్ నగరంలో వనమహోత్సవం ఉత్సాహంగా సాగింది. స్థానిక అమ్మ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ ఛైర్మన్ దాదన్న విఠల్ రావు మొక్కలు నాటారు.

ప్రతీ కుల సంఘం ముందుండాాలి...

తెలంగాణకు హరితహారం విజయవంతం చేసేందుకు ప్రతీ కుల సంఘం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని జడ్పీ చైర్మన్ కోరారు. మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణనూ చిత్త శుద్ధితో చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అమ్మ ఫార్మర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ రేంజర్ల నరేష్, ప్రధాన కార్యదర్శి వేణు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : కరోనా వ్యాక్సిన్ల రేసులో ప్రపంచ దేశాల పరుగు.!

ABOUT THE AUTHOR

...view details