నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి ప్రారంభించారు. లాక్డౌన్ సమయంలో రక్తం అవసరం ఉన్న పేషెంట్లకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.
ఇంటికి వచ్చి రక్తం సేకరించుకుంటాం..ఫోన్ చేయండి - nizamabad district latest news today
రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు.
ఇంటికి వచ్చి రక్తం సేకరించుకుంటాం..ఫోన్ చేయండి
అటవీశాఖకు సంబంధించిన ఉద్యోగులు, పలువురు యవకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రక్తదానం చేసిన వారిని కలెక్టర్ అభినందించారు. బ్లడ్ డొనేట్ చేసే వారు కనీసం 10 యూనిట్ల నుంచి ఎన్ని యూనిట్లైనా ఇవ్వవచ్చన్నారు. ముందుకొచ్చేవారు 08462-251251 నెంబర్కు తెలియజేస్తే బ్లడ్ బ్యాంక్ టీం వచ్చి రక్తం సేకరించుకుంటారని తెలిపారు.
ఇదీ చూడండి :నేడు భారతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం