నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలోని సుద్దులం గ్రామ శివారులో యువకుడు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన రామసత్యం నీటిలో మునిగి చనిపోయాడు. నిజామాబాద్ నగరంలోని బోర్గాం (పీ) గ్రామానికి చెందిన రామసత్యం మరణవార్తతో యువకుడి స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈతకు వెళ్లి యువకుడు మృతి - నిజామాబాద్ జిల్లా వార్తలు
సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో చోటు చేసుకుంది. సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు చనిపోవడం వల్ల యువకుడి గ్రామంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి.
ఈతకు వెళ్లి యువకుడు మృతి