Young Girl Dies In Young Man Attack At Nizamabad :ఈ మధ్యకాలంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. పసి పాప నుంచి పండు ముసలి దాకా.. కామాంధులు ఎవరినీ వదలడం లేదు. వావి వరసలు మరచి.. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. బ్లాక్ మెయిల్‌తో ఒకడు, బెదిరించి మరొకడు, స్నేహం పేరుతో ఇంకొకడు, ప్రేమ, పెళ్లి.. ఇలా 'అఘాయిత్యానికి పాల్పడేందుకు అడ్డదారులెన్నో' అన్నట్లుగా బంధువులు, తెలిసిన వారు, పరిచయస్థులు, స్నేహితుల ముసుగు తొడిగిన వారే ఎక్కువగా ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడటం.. ప్రేమను అంగీకరించాలంటూ వేధించడం.. ఒప్పుకోకపోతే చంపేయడం.. నేటి యువకులకు ఇదో ట్రెంట్ అయిపోయింది. తాజాగా నిజామాబాద్ జక్రాన్‌పల్లిలో యువకుడి దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి 6 రోజులుగా మృత్యువుతో పోరాడి ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన గౌసుద్దీన్ అనే యువకుడు ప్రేమించాలని కోరాడు. ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లాడు. ఈ నెల 23న రాత్రి గౌసుద్దీన్ తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకున్న యువతిని ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు.
A Lover Attack on Young Woman With Knife : ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు
Young Woman Dies in Attack by Young Man :గాయపడిన యువతిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్‌తో 6 రోజులుగా చికిత్స పొందుతూ.. ఈరోజు తెల్లవారుజామున యువతి మృత్యువాతపడింది. యువతి మృతి చెందిందని విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాలు, మహిళా సంఘాలు మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తేజశ్రీకి మద్దతుగా.. మృతికి కారణమైన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రేమోన్మాదిని బహిరంగంగా ఉరితీయాలని నినాదాలు చేశారు. స్థానిక పోలీసులు వచ్చి వారికి నచ్చచెప్పి ఆందోళన విరమించేలా చేశారు. మరోవైపు యువతి మృతికి సంతాపంగా పట్టణంలో దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు.
Young Man Attacked Woman in Nizamabad :యువతిని అవయవ దానానికి కుటుంబీకులు హైదరాబాద్‌లోని జీవదాన్కు తరలించారు. అయితే అప్పటికే తేజశ్రీ మృతి చెందిందని.. అవయవాలు ఏవీ పనిచేయటం లేదని అక్కడి వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసుల సూచన మేరకు మృతదేహాన్ని నిజామాబాద్ మార్చురీకి తరలించారు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. తేజశ్రీ మృతదేహాన్ని చూసి గ్రామస్థులు, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల బందోబస్తు నడుమ తేజశ్రీ అంతక్రియలు నిర్వహించారు.
Young Man Attacked Woman : ప్రేమ పేరుతో యువతిపై దాడి.. చికిత్స పొందుతూ చనిపోయిన యువతి...
Attacked with a knife for refusing love: ప్రేమను నిరాకరించిందనే కోపం.. పట్టపగలే ప్రియురాలిపై కత్తితో దాడి