ప్రజలంతా క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకాంక్షించారు. నగరంలోని కంటేశ్వర్ సీఎస్ఐ చర్చ్‌లో క్రిస్మస్ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. శాంతి, దయ, కరుణ గల మహోన్నతుడు ఏసు ప్రభువని... ఆయన చూపిన మార్గంలో అందరం సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని కలెక్టర్ తెలిపారు.
'ప్రజలంతా సోదరభావంతో మెలగాలి' - Xmas Celebrations in Nizamabad district
నిజామాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని కంటేశ్వర్ సీఎస్ఐ చర్చ్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు.
!['ప్రజలంతా సోదరభావంతో మెలగాలి' xmas-celebrations-in-nizamabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5487627-1081-5487627-1577264376844.jpg)
'ప్రజాలంతా సోదరభావంతో మెలగాలి'