తెలంగాణ

telangana

ETV Bharat / state

రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు - wrestling competitions

ఇందూరులోని చిక్కపల్లి గ్రామంలో కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన మల్లయోధులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీటిని చూడటానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

wrestling-competitions-at-chikkadpally-village-in-nizamabad-district
రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు

By

Published : Feb 23, 2020, 11:49 AM IST

నిజామాబాద్​ జిల్లా రుద్రూర్​ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన కిషన్​రావు పటేల్​ స్మారకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏర్పాటు చేశారు.

ఈ కుస్తీ పోటీల్లో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మల్లయోధులు పొటీపడ్డారు. రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలను తిలకించడానికి గ్రామస్థులు తండోతండాలుగా తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో గెలిచిన మల్లయోధులకు 10 రూపాయల నుంచి 1001రూపాయల వరకు బహుమతులను ప్రదానం చేశారు.

రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు

ఇదీ చూడండి: 'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

ABOUT THE AUTHOR

...view details