తెలంగాణ

telangana

ETV Bharat / state

Suicide attempt: ప్రియుడి మోసం.. ప్రియురాలు ఆత్మహత్యాయత్నం - సూసైడ్

ప్రేమికుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్​లో చోటుచేసుకుంది. ప్రియుడు రహస్యంగా పెళ్లి చేసుకొని మోసం చేశాడని యువతి అఘాయిత్యానికి పాల్పడింది. దీంతో ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Suicide attempt
నిజామాబాద్​లో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం

By

Published : Jun 20, 2021, 8:49 PM IST

Updated : Jun 20, 2021, 10:19 PM IST

నిజామాబాద్‌లో ప్రేమికుడి ఇంట్లో ఫినాయిల్ తాగి ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు రహస్యంగా పెళ్లి చేసుకొని మోసం చేశాడని యువతి అఘాయిత్యానికి పాల్పడింది. దీంతో ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రియుడు మోసం చేశాడని...

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్​గా పనిచేస్తున్న ఓ యువకుడు ఏడాది క్రితం ఆమెను ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఐతే ఆ విషయం ఆ యువతి ఇంట్లో వాళ్లకు చెప్పకపోవడంతో ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లిచేశారు. యువతికి పెళ్లైన రెండో రోజునే ఆ అధికారి ఆమె ఇంటికివచ్చి రహస్యంగా మరో ఇంట్లో ఉంచి అక్కడి నుంచి పరారయ్యాడు.

అనంతరం మోసపోయానని గ్రహించిన ఆ అమ్మాయి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ సంఘటనకు కారణమైన అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబసభ్యులు ఆమెను యువకుడి ఇంట్లో వదిలివెళ్లారు. దీంతో అవమానం భరించలేక ప్రియుడి ఇంట్లోనే యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఇదీ చూడండి:Brutal murder: కారుని అడ్డుకుని.. కత్తులతో పొడిచి దారుణ హత్య

Last Updated : Jun 20, 2021, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details