తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళ దారుణ హత్య.. పోలీసుల దర్యాప్తు - WOMEN BRUTALLY MURDERED IN NIZAMABAD

బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరిన భర్త.. రక్తపు మడుగులో భార్య విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్​కు గురయ్యాడు. ఎవరు.. ఎందుకు... హత్య చేశారు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన నిజమాబాద్​లో జరిగింది.

WOMEN BRUTALLY MURDERED IN NIZAMABAD
WOMEN BRUTALLY MURDERED IN NIZAMABAD

By

Published : Mar 10, 2020, 8:04 AM IST

Updated : Mar 10, 2020, 9:59 AM IST

నిజామాబాద్​లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నగరంలోని ఆర్యనగర్​కు చెందిన లక్ష్మి(40)ని గుర్తు తెలియని దుండగులు చంపేశారు. ఒంటరిగా ఉన్న సమయం చూసుకుని దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. బయటకు వెళ్లిన భర్త శ్రీనివాస్​ ఇంటికి తిరిగి వచ్చే సరికి ఆమె కుర్చీలో విగతజీవిగా పడి ఉంది. రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు.

హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు ఆరా తీశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలిలో కారంపొడి కన్పించింది.​ ఎవరైనా చోరీ చేసేందుకు రాగా... లక్ష్మి ప్రతిఘటిస్తే హత్య చేశారా...? శ్రీనివాస్​ అంటే గిట్టని వాళ్లు ఎవరైనా ఈ పనిచేశారా...? అన్న కోణంల్లో పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

లక్ష్మి కుటుంబ సభ్యులది ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కనిగిరి కాగా.. కొంతకాలంగా నిజామాబాద్​లోనే ఉంటున్నారు. భర్త శ్రీనివాస్ భవన నిర్మాణ గుత్తేదారుగా పని చేస్తున్నాడు. పిల్లలు ఆంధ్రప్రదేశ్​లోనే ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు.

మహిళ దారుణ హత్య... పోలీసులు దర్యాప్తు

ఇదీ చూడండి:ఆ కలెక్టరు పేరు చెబితే అధికారులు హడలిపోతున్నారు

Last Updated : Mar 10, 2020, 9:59 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details