తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆయుష్మాన్​ భారత్​ వస్తే.. పేదలకూ కార్పొరేట్​ వైద్య సేవలు'

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తే.. పేదలూ కార్పొరేట్ ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకోగలుగుతారని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్​లో నూతనంగా నిర్మించిన ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు.

By

Published : Feb 15, 2020, 3:29 PM IST

with Ayushman bharath The poor get corporate medical services
'ఆయుష్మాన్​ భారత్​ వస్తే.. పేదలకూ కార్పొరేట్​ వైద్య సేవలు అందుతాయి'

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సన్​రైజ్​​ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తే.. పేద ప్రజలు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోగలుగుతారని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, పలువురు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.

'ఆయుష్మాన్​ భారత్​ వస్తే.. పేదలకూ కార్పొరేట్​ వైద్య సేవలు అందుతాయి'

ఇదీ చూడండి:భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details