తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశం తరఫున సత్తా చాటుతా: గుగులోత్ సౌమ్య - Grand welcome for soumya in nizamabad

ఫుట్​బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్యకు నిజామాబాద్​ జిల్లా ఫుట్​బాల్ అసోసియేషన్ ఘనస్వాగతం పలికింది. అనంతరం సౌమ్యను, కోచ్ నాగరాజును సన్మానించారు.

Guguloth Soumya
గుగులోత్ సౌమ్య

By

Published : Apr 9, 2021, 10:44 PM IST

భారత జాతీయ జట్టుకు ఎంపికై అంతర్జాతీయ మ్యాచ్​లలో ప్రాతినిథ్యం వహించి తిరిగి దేశానికి చేరుకున్న సీనియర్ ఉమెన్ టీమ్ ఫుట్​బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్యకు నిజామాబాద్​లో ఘన స్వాగతం లభించింది. దేశం తరఫున టర్కీ, ఉజ్బెకిస్థాన్​తో జరిగిన పోటీల్లో సత్తా చాటి నాలుగు మ్యాచ్​లలో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో సౌమ్యకు జిల్లా ఫుట్​బాల్ అసోసియేషన్, ప్రజలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సన్మానించారు. సౌమ్యతో పాటు కోచ్ నాగరాజును జిల్లా ఫుట్​బాల్ అసోసియేషన్, కేర్ ఫుట్​బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

అందరి సహకారంతోనే సీనియర్ జట్టుకు ఎంపికయ్యానని.. కోచ్, తల్లిదండ్రులు ఎంతో సహకరించారని సౌమ్య చెప్పారు. సౌమ్య ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన కోచ్.. దేశం తరఫున మరిన్ని టోర్నీల్లో సత్తా చాటాలని కోచ్ నాగరాజు అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య.. భారత ఫుట్​బాల్ మహిళల జట్టుకు తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక అమ్మాయి అని కొనియాడారు.

దేశం తరఫున సత్తా చాటుతా: గుగులోత్ సౌమ్య

ఇవీచూడండి:షర్మిల రాజకీయ భవిష్యత్తు తెలంగాణతోనే ముడిపడి ఉంది: విజయమ్మ

ABOUT THE AUTHOR

...view details