గులాబీ జెండానే ప్రజలకు అండగా ఉంటుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్, కౌల్పూర్, లక్కంపల్లి, మల్లారం, ఐలాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస సభ్యులు ఎక్కడికివెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. భాజపా, కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశాయని విమర్శించారు. కారు గుర్తుకు ఓటేసి కవితను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
'కవితను ఐదు లక్షల భారీ ఆధిక్యంతో గెలిపించుకుంటాం' - ELECTION CAMPAIGN
ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న వేళ.. అన్ని పార్టీలు ప్రచారం ఉద్ధృతం చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. ఉదయమే పార్లమెంట్ పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
తెరాస సభ్యులు ఎక్కడివెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు : జీవన్ రెడ్డి