తెలంగాణ

telangana

ETV Bharat / state

కారులోనే ఉంటారా... కాషాయ తీర్థం పుచ్చుకుంటారా? - AMITHSHA

తెరాస సీనియర్​ నేత డి. శ్రీనివాస్​ కారులోనే కొనసాగుతారా... కాషాయ కండువా కప్పుకుంటారా... అనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. చాలా రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డీఎస్​... తెరాస పార్లమెంటరీ సమావేశానికి రావటం... ఆ వెంటనే అమిత్​షాను కలవటంపై ఆంతర్యమేంటని ఆలోచిస్తున్నారు. కొడుకు అర్వింద్​ భాజపా ఎంపీగా ఉన్న నేపథ్యంలో మరి డీఎస్​ దారెటంటూ తీవ్ర చర్చ నడుస్తోంది.

WILL D.SRINIVAS STAY IN TRS OR JUMP IN TO BJP...?

By

Published : Jul 12, 2019, 8:23 PM IST

కారులోనే ఉంటారా... కాషాయ తీర్థం పుచ్చుకుంటారా?
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్​ను గద్దెనెక్కించిన సీనియర్ నేత డి.శ్రీనివాస్​కు జాతీయ రాజకీయాల్లో మంచి పేరు ఉంది. కాంగ్రెస్​లో ప్రతికూల పరిస్థితులతో తెరాసలో చేరారు ఈ సీనియర్​ నేత. కొంతకాలం ప్రభుత్వ సలహాదారునిగా కొనసాగిన డీఎస్... రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఉత్సాహం చూపించినా... సరైన ప్రాధాన్యత దక్కలేదని బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు డీఎస్​. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నరంటూ మాజీ ఎంపీ కవిత నేతృత్వంలో జిల్లా ప్రజాప్రతినిధులంతా గతేడాది జూన్​లో అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కానీ... కేసీఆర్​ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొంతకాలంగా స్థానిక కార్యకర్తలు, అనుచరుల ఒత్తిడి పెరగటం వల్ల పార్టీపై తిరుగుబావుటా ఎగుర వేశారు. పార్టీ నుంచి సస్సెండ్ చేయాలి లేదంటే తనపై చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఆశ్యర్యపర్చిన డీఎస్​ సమావేశాలు...

అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్న డీఎస్​... రెండు రోజుల క్రితం నిర్వహించిన తెరాస పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. 24 గంటలు గడవకముందే భాజపా అధ్యక్షుడు అమిషాను కలిసి కార్యకర్తలకు మరో షాక్​ ఇచ్చారు. తెలంగాణను టార్గెట్ చేసిన భాజపా నేతతో డీఎస్​ భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎస్ కమలం గూటికి చేరితే పలు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు కూడా క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెరాసకు ప్రత్యామ్నయం భాజపానే అని ప్రచారం చేస్తున్న కమలం పార్టీ నేతలు... ఆ దిశలో కార్యాచరణ ప్రారంభించినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.

కాషాయ కండువా కప్పుకుంటారా...?

అమిత్ షాతో డీఎస్​ భేటీ వెనుక ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఉన్నట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది. గత ఎంపీ ఎన్నికల్లో అర్వింద్​ను గెలిపించటం కోసం తెర వెనుక డీఎస్​ పని చేసినట్లు ప్రచారం జరిగింది. ఇందుకోసం డీఎస్ తన పాత అనుచరులు, ప్రస్తుత రాజకీయ నాయకులు, సామాజిక వర్గానికి చెందిన కొందరిని ఎన్నికల్లో పురమాయించినట్లు చర్చ నడుస్తోంది. ఈ వార్తలే నిజమైతే కుమారుడు భాజపా ఎంపీగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే డి. శ్రీనివాస్​ కాషాయ కండువా కప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవీ చూడండి: కిడ్నాప్​ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details