నిజామాబాద్ జిల్లా నందిపేటలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్య,కొడుకులుకలిసి కుటుంబ పెద్దనే పొట్టనబెట్టుకున్నారు. పట్టణంలోని దుబ్బ ప్రాంతంలో నివాసముండే... గంధం రమేశ్ (41) అనే వ్యక్తిని భార్య, ఇద్దరు కొడుకులు తాడుతో ఉరేసి హత్య చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయారు.
కొడుకులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య - murder news
కుటుంబ కలహాలతో విసుగుచెందిన భార్య... కొడుకులతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్యచేసిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాగుడు బానిసై... తరచూ గొడవపడే భర్తతో వేగలేక హత్య చేసి ఉంటారని స్థానికులు తెలిపారు.

కొడుకులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
గత కొన్ని నెలలుగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తటం వల్ల రమేశ్... తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. విసుగెత్తిన కుటుంబ సభ్యులు పథకం ప్రకారం తాడుతో మెడకు ఉరేసి హత్య చేశారు. స్థానికులు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఈ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబీకులు విసుగు చెంది హత్య చేసి ఉంటాని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.