తెలంగాణ

telangana

ETV Bharat / state

భర్త ఇంటి వద్ద భార్య ధర్నా

భర్త వేధిపులు తాళలేక ఓ వివాహిత పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్లు గడిచిన తర్వాత తిరిగొచ్చిన ఆమె... ఇంటికి తాళం వేసి ఉండటం చూసి అయోమయానికి గురైంది. తనకు న్యాయం చేయాలంటూ మూడు రోజుల నుంచి ఇంటి ఎదుటే ఆందోళన చేపట్టింది. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో జరిగింది.

Wife dharna in front of husband house in nizamabad
భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా

By

Published : Feb 25, 2021, 12:02 AM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో భర్త ఇంటి వద్ద భార్య ధర్నాకు దిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మెట్టాడిపల్లికి చెందిన కీర్తికి మూడేళ్ల క్రితం నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని కసాబ్​గల్లికి చెందిన వినయ్​తో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి భర్త తనను వేధింపులకు గురిచేసేవాడని బాధితురాలు తెలిపింది. వినయ్​కి వేరే యువతితో వివాహేతర సంబంధం ఉందని.. ఆరోపించింది. వేధింపులు భరించలేక కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లిపోయానని బాధితురాలు పేర్కొంది.

తిరిగి ఇంటికొస్తే తాళం వేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భర్త ఇంటి వద్దే ఆందోళనకు దిగింది.

ఇదీ చదవండి:వామన్‌రావు దంపతుల హత్య కేసుపై ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ

ABOUT THE AUTHOR

...view details