తెలంగాణ

telangana

విస్తారంగా వర్షాలు... హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

By

Published : Aug 15, 2020, 8:33 PM IST

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని చెరువులు, కుంటలు, మత్తడ్లు జలకళను సంతరించుకున్నాయి. విస్తారంగా పడిన వానలతో జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

widespread rain in nizamabad district
విస్తారంగా వర్షాలు... హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ధర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, డిచ్​పల్లి, జక్రాన్​పల్లి మండలాల్లోని చెరువులు, కుంటలు, మత్తడ్లు జలకళను సంతరించుకున్నాయి. సిరికొండ మండలంలో కురిసిన వర్షానికి కప్పల వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల వాగుపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. సిరికొండ, ధర్పల్లి మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా గడుకోల్, హోన్నజీపేట్ గ్రామాల మీదుగా జిల్లా కేంద్రానికి దారి మళ్లించారు అధికారులు.

సిర్ణపల్లి జానకీబాయ్ చెరువు, ఇందల్వాయి పెద్ద చెరువులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. వెంగల్​పాడ్ వాగులో నిర్మించిన చెక్ డాంలు పొంగిపొర్లుతున్నాయి. వాడివాగులో వరద కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ABOUT THE AUTHOR

...view details