తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టా పుస్తకాలు ఇంకెప్పుడు ఇస్తారు? - jaldhapalli village

గ్రామ రెవెన్యూ అధికారిని గ్రామస్థులు నిర్బంధించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ గ్రామస్థులతో చర్చించి వారికి పట్టా, పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వీఆర్వోను విడుదల చేశారు.

సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి : గ్రామ వాసులు

By

Published : Jul 8, 2019, 9:23 PM IST

నిజామాబాద్ జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారిని గ్రామస్థులు నిర్బంధించారు. జిల్లాలోని కోటగిరి మండలం జల్దాపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులతో పాటు వీఆర్వో కృష్ణారెడ్డి హాజరయ్యారు. పట్టాపుస్తకాల గురించి వీఆర్వోను గ్రామస్థులు ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం రాలేదు. ఆగ్రహానికి గురైన గ్రామస్థులు అధికారిని నిర్బంధించి కార్యాలయానికి తాళం వేశారు. పంచాయతీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న కోటగిరి ఇంఛార్జీ తహసీల్దార్​ విఠల్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల గ్రామస్థులు ఆందోళన విరమించారు. పాసు పుస్తకాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని... సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నారు.

పాసు పుస్తకాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం : గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details